Home / తప్పక చదవాలి
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై ప్రతిపాదిత సెలెక్ట్ కమిటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సమర్పించిన తీర్మానంపై ఐదుగురు రాజ్యసభ ఎంపీలు తమ సంతకాలను ఫోర్జరీ చేశారని సోమవారం ఆరోపించడంతో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాదంలో చిక్కుకున్నారు. 'ఫోర్జరీ' ఘటనలో దోషిగా తేలితే రాఘవ్ చద్దాపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని రాజ్యసభ ఛైర్మన్ సిఫారసు చేయవచ్చని తెలిసింది.
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి విమర్శలు గుప్పించారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్లో మాట్లాడిన చిరంజీవి.. ప్రభుత్వం ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పేదల గురించి ఆలోచించాలన్నారు. ఇలాంటి విషయాలపై ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
ఢిల్లీలో బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే వివాదాస్పద చర్యను రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఢిల్లీ సేవల బిల్లు సోమవారం పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేటి నుంచి పార్లమెంట్లో చర్చ ప్రారంభమయింది. వివాదాస్పద మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ పై వత్తిడి తెచ్చేందుకు I.N.D.I.A (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) కూటమి యొక్క సమిష్టి ప్రయత్నాల మధ్య అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు, పాలక సభ్యుల మధ్య వాగ్వాదానికి వేదికైంది.
జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.
జూలైలో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 1.77 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో సంవత్సరానికి 10 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ప్రకారం త్రీవీలర్లు రికార్డు స్థాయిలో 74 శాతం వృద్ధిని సాధించాయి.
వాట్సాప్, దాని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో గ్రూప్ సంభాషణల కోసం కొత్త వాయిస్ చాట్ ఫీచర్ను పరిచయం చేస్తోంది. గ్రూప్ చాట్లో వాయిస్ వేవ్ఫార్మ్ చిహ్నాన్ని యాక్సెస్ చేయడానికి ఈ ఫీచర్ బీటా వినియోగదారులను అనుమతిస్తుంది.
నటి షెర్లిన్ చోప్రా బోల్డ్ గా చేసే కామెంట్లతో తరచుగా మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ మాజీ 'బిగ్ బాస్ 13' కంటెస్టెంట్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని వివాహం చేసుకోవడాన్ని పరిశీలిస్తారా అని సరదాగా అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం వైరల్గా మారింది.
లోక్సభ సోమవారం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2023ని వాయిస్ ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును ఆగస్టు 3న లోక్సభలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. వ్యక్తుల డిజిటల్ డేటాను దుర్వినియోగం చేసినందుకు లేదా రక్షించడంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకు జరిమానాను ప్రతిపాదిస్తూ, భారతీయ పౌరుల గోప్యతను కాపాడేందుకు ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.
మణిపూర్లో జాతి హింసకు సంబంధించిన అంశంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ కమిటీ మానవతా దృక్పథాలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించి కొనసాగుతున్న దర్యాప్తు పరిధిని దాటి తన పరిధిని విస్తరిస్తుందని ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ ప్రకటించారు.