Undavalli supports Megastar: సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిదే.. మెగాస్టార్ చిరంజీవికి ఉండవల్లి సపోర్ట్
సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్దించారు.చిరంజీవి వ్యాఖ్యలకు అర్థం వుంది. చిరంజీవి సామాన్య వ్యక్తి కాదని ఉండవల్లి అన్నారు.
Undavalli supports Megastar: సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్దించారు.చిరంజీవి వ్యాఖ్యలకు అర్థం వుంది. చిరంజీవి సామాన్య వ్యక్తి కాదని ఉండవల్లి అన్నారు.
చిరంజీవి రాజకీయాలలో కొనసాగి వుంటే ఈరోజు పరిస్థితి వేరేలా వుండేదని ఆయన అన్నారు. 18శాతం ఓట్లు వచ్చాయి.. ఆయన్ను చిన్నాడిలా మాట్లాడితే ఎలా? చిరంజీవి ప్రతి ఇంటికి కనెక్ట్ అయి ఉన్నారు.. అందరూ మన వాడేనని అనుకుంటారు.రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో చిరంజీవి ఒక్కరే గట్టిగా మాట్లాడారు.విభజన అంశాలపై ఆయన గట్టిగా మాట్లాడే అంశాన్ని కొందరు ఆశ్చర్యపోయారు.కేంద్ర మంత్రిగా ఉంటూ అంత గట్టిగా ఎలా మాట్లాడుతారని కూడా ఆయనను ప్రశ్నించారు.హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న అంశంపై చిరంజీవి గట్టిగా పట్టుబట్టారని తెలిపారు.
పోలవరం పూర్తవుతుందనే నమ్మకం నాకు లేదు..(Undavalli supports Megastar)
ఏ ఆటంకాలు లేకపోతే పోలవరం ఏడాదిలో పూర్తయేదని ఉండవల్లి అన్నారు. పోలవరానికి కేంద్రం డబ్బులు ఇవ్వకపోవడమే అసలు సమస్య.చంద్రబాబు, అంబటి రాంబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పవర్ లేదన్నారు. పోలవరం పూర్తవుతుందనే నమ్మకం నాకు లేదు.ఇప్పుడు తెలంగాణ బంగారం అయిందని కేసీఆర్ చెబుతున్నారు.పోలవరం పూర్తయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బంగారం అయ్యేది.పోలవరం నిర్వాసితులకు కేంద్రమే నేరుగా డబ్బులు ఇచ్చుకోవచ్చని సీఎం జగన్ చెప్పడం మంచి మాట.పోలవరం ప్రాజెక్టు ను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పడం వెనుక అసలు ఏం జరిగిందో బయట పెట్టాలి. మార్గదర్శి కేసులో నిజాలు బయట పెట్టేందుకు జగన్ ప్రభుత్వం నాకు సహకరించాలని కోరుకుంటున్నానని ఉండవల్లి పేర్కొన్నారు.