Home / తప్పక చదవాలి
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను కొట్టి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్‌కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి దూరంగా ఒక రోజు గడిపినందుకు అతను తన 20 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. దమ్ముంటే పవన్‌ను 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. నిన్న సభలో స్టీల్‌ప్లాంట్ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలన్నారు.
పార్లమెంట్లో ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై కౌంటర్ ఎటాక్ చేశారు. విపక్షాలు కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి అభాసుపాలవుతున్నాయని.. వారి అవిశ్వాస తీర్మానాల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని చురకలంటించారు
సహారా ఆఫ్రికా కు చెందిన 27 మంది వలసదారులు సరిహద్దుకు సమీపంలో ఉన్న పశ్చిమ ఎడారిలో చనిపోయారని లిబియా అధికారులు తెలిపారు.లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో మృతదేహాలు సరిహద్దుకు సమీపంలో కనుగొన్నామని తెలిపింది. ఆ ప్రాంతానికి ఫోరెన్సిక్ బృందాన్ని లిబియా ప్రభుత్వ ప్రతినిధి మహ్మద్ హమౌడా తెలిపారు.
ప్రశాంతమైన విశాఖ నగరం భూకబ్జాదారుల, రియల్లర్ల, గూండాల చేతిలో చిక్కుకుని అల్లాడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆయన ప్రసంగించారు
జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు, సినిమాల గురించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నానని రేణూ దేశాయ్ చెప్పారు. తాను జీవితంలో ముందుకు సాగిపోతున్నానని రేణూ దేశాయ్ తెలిపారు.
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారిని భూమన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం తన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూకు సంబంధించిన ఆరోగ్య విషయాలను పంచుకున్నారు. అతను తన భార్య ఐదవ కీమోథెరపీ సెషన్లో తీసిన చిత్రాలను పోస్ట్ చేశాడు. ఆమెను ఓదార్పు కోసం మనాలికి తీసుకెళ్లే సమయం ఇది అని సిద్ధూ చెప్పారు.
మణిపూర్‌లో మరో సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. మే 3న జాతి ఘర్షణలు చెలరేగడంతో చురాచంద్‌పూర్‌లోని తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా తనపై కుకీ వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 37 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
హవాయిలోని రిసార్ట్ సిటీ లహైనాలో హరికేన్ నుండి వచ్చిన గాలులతో రేగిన కార్చిచ్చుతో 36 మంది మరణించారని మౌయి కౌంటీ ఒక ప్రకటనలో తెలిపింది.లహైనా, దాని నౌకాశ్రయం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది నివాసితులను అక్కడినుంచి తరలించారు. పొగ, మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు సముద్రంలోకి దూకారు.