Last Updated:

Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి  గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్‌ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారిని భూమన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Bhumana Karunakar Reddy: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి  గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గరుడాళ్వార్‌ సన్నిధిలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారిని భూమన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

అంతకుముందు బుధవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కరుణాకర్ రెడ్డి కలిసారు.టీటీడీకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ ప్ర‌మాణస్వీకారం చేసిన అనంత‌రం గురువారం ఆయ‌న అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా త‌న‌కు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కింద‌న్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామ‌న్నారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన‌ట్టు చెప్పారు.

ఆధ్యాత్మిక వెలుగులు నింపుతాం..(Bhumana Karunakar Reddy)

ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు, కార్యనిర్వహణాధికారులు, కార్యనిర్వాహక అధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి, విశ్వాసం తో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింద‌న్నారు. దీన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా త‌మ‌ ధర్మకర్తల మండలి ప‌నిచేస్తుంద‌న్నారు. గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన హ‌యాంలో సామాన్య భ‌క్తుల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చేలా ఆచ‌ర‌ణ‌లో చేసి చూపామ‌న్నారు. స్వామివారి వైభ‌వాన్ని ప్ర‌జ‌ల హృద‌యాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామ‌ని చెప్పారు. హోదా, అధికారం, తాము ముఖ్య‌ల‌మ‌నే భావ‌న‌తో దేవుడి ద‌గ్గ‌రికి వ‌చ్చేవారిని ఆయ‌న క్ష‌ణ‌కాల‌మైనా చూడ‌క‌పోతే ఉప‌యోగం లేద‌న్నారు. దేశ‌విదేశాల్లోని హిందువులంద‌రినీ ఏక‌తాటిపైకి తెచ్చి హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌చారం చేసేలా టీటీడీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని చెప్పారు. తాను స్వామివారి సేవ‌కుల‌కు సేవ‌కునిగా ప‌నిచేస్తాన‌ని, అధికారం కోసం కాద‌ని అన్నారు. స్వామివారిని భ‌క్తుల ద‌గ్గ‌రికే తీసుకెళ్లి భ‌క్తిప్ర‌సాదం పంచుతామ‌న్నారు.

గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌న్నారు. సామాన్య భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం చేయించ‌డానికే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని, ధ‌న‌వంతుల సేవ‌లో త‌రించేవాడిని కాద‌ని క‌రుణాక‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధ‌న‌వంతులు, విఐపిలు ద‌ర్శ‌నాల గురించి తాప‌త్ర‌య‌ప‌డితే స్వామివారి ఆశీస్సులు ల‌భించ‌వ‌నే వాస్త‌వం గుర్తించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.