Home / తప్పక చదవాలి
ఉత్తరాఖండ్‌లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణని మానుకోవాలని, అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకరించడాన్ని కూడా వదిలేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. రాజధాని వ్యవహారంపై విశ్లేషణ చేస్తూ జోగయ్య ఓ సంచలన లేఖ విడుదల చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా శివాలయం కూలిపోవడంతో కనీసం తొమ్మిది మంది మరణించారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిఖు తెలిపారు.కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు చిక్కుకున్నారని, పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
గాజవాక నా నియోజక వర్గం.. దీన్ని నేను వదిలి పెట్టను.. నేను ఓడిపోయాను కాని నా ఆశయం ఓడిపోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో బాగంగా ఆదివారం రాత్రి గాజువాక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ)కి చెందిన సాయుధ తిరుగుబాటుదారులు పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో చైనా ఇంజనీర్ల కాన్వాయ్‌పై చేసిన దాడిలో 13 మంది మరణించారు.
ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ సంవత్సరం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,800 మంది 'ప్రత్యేక అతిథులు' పాల్గొంటారు. పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వీరిని ఆహ్వానించారు.
తన భారతీయ ప్రేమికుడితో కలిసి ఉండటానికి సరిహద్దులు దాటిన పాకిస్థానీకి చెందిన సీమా హైదర్‌కు రాజ్ ఠాక్రే యొక్క మహారాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన ఒక నాయకుడువార్నింగ్ ఇచ్చారు. సీమా హైదర్ కధను తెరకెక్కించడాన్ని ఆపాలని లేకపోతే తీవ్ర పరిణాములు ఉంటాయని హెచ్చరించారు.
హర్యానాలో హిందూ సమూహం సభకు అనుమతి కోసం ద్వేషపూరిత ప్రసంగం చేయవద్దు" షరతు ఉన్నప్పటికీ, కొంతమంది వక్తలు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడవద్దని స్పీకర్లను హెచ్చరించారని నిర్వాహకులు పేర్కొన్నారు, అయితే కొందరు వక్తలు దానిని పట్టించుకోలేదు. ‘వేలు ఎత్తితే చేతులు నరికేస్తాం’ అని ఒకరు పేర్కొనగా మరొకరు రైఫిళ్లకు లైసెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పోస్ట్‌పై ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ యాదవ్‌లతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతల 'X' ఖాతాల 'హ్యాండ్లర్ల'పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఇండోర్ పోలీసులు శనివారం తెలిపారు.