Home / తప్పక చదవాలి
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రష్యా యొక్క పోరాటానికి మద్దతు ఇస్తానని ప్రమాణం చేశారు. "రష్యన్ ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలకు మేము ఎల్లప్పుడూ పూర్తి మరియు షరతులు లేని మద్దతును ఇస్తాము.
లిబియాను వణికించిన డేనియల్ తుఫానుతో మృతిచెందిన వారి సంఖ్య సుమారు ఐదు వేలకు చేరింది. పది వేలమంది వరకు ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. లిబియాకు తూర్పు తీర ప్రాంతం నగరమైన డెర్నాలో నాలుగోవంతు నగరం తుడిచిపెట్టుకుపోయింది.
అమెరికాలో ఒక తెలుగు విద్యార్ది ప్రమాదంలో మరణిస్తే ఆమె ప్రాణాలకు విలువలేదంటూ హేళనగా మాట్లాడిన పోలీసు అధికారిపై భారతీయులు భగ్గుమంటున్నారు. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును లూథ్రా కలిశారు. న్యాయపరమైన విషయాలపై చంద్రబాబుతో లూథ్రా చర్చించారు. 45 నిమిషాల చర్చల అనంతరం బయటకి వచ్చిన లూథ్రా మీడియాతో మాట్లాడలేదు.
G20 సదస్సుకోసం ఢిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం భద్రతా సిబ్బందిచే బ్యాగ్‌ని తనిఖీ చేయడానికి నిరాకరించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇది జరిగింది.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌తో పాటు అతనితో సంబంధం ఉన్న వారిపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ముంబైలోని 30కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం బుధవారం దాడులు ప్రారంభించింది.
కేరళలోని కోజికోడ్ లో నిపా వైరస్ తో ఇద్దరు మృతి చెందిన నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. సమీపంలోని ఏడు పంచాయతీలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు. నియంత్రణలు చేపట్టింది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గాజ్యా నాయక్ తండా లో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా సొంత అక్కపై కక్షతో సొంత తమ్ముడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో కనీసం 11 మంది మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. బుధవారం ఉదయం వరకు అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.