Home / తప్పక చదవాలి
చంద్రబాబు జోలికి రావడం.. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పని దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేసారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదన్నారు.
ప్రజా సమస్యలపై జనసేన ప్రశ్నిస్తుంటే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు సృష్టిస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 20,000 మార్క్‌ను తాకడం విశేషం. దిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయం కుదరడం కూడా మార్కెట్లలో ఉత్సాహం నింపింది.
ఉత్తరప్రదేశ్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను హత్య చేసినందుకు మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని సోమవారం అరెస్టు చేశారు. నోయిడాలోని తమ బంగ్లాలో ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు అజయ్ నాథ్ ఆదివారం నేరం చేసిన తర్వాత బంగ్లాలోని స్టోర్ రూమ్‌లో దాక్కున్నాడని పోలీసులు తెలిపారు.
పాకిస్తాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పలు విమానాలను నిలిపివేసింది. తన 13 లీజు విమానాలలో కూడా ఐదు విమానాల సర్వీసులను నిలిపివేయగా మరో నాలుగు విమానాల సర్వీసులు కూడా నిలిపోనున్నాయని సమాచారం.
ముంబై-గౌహతి ఇండిగో విమానంలో మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసి గౌహతిలో పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మోండల్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా జప్తు చేశాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆగి ఉన్న వ్యాను ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 15 మంది మహిళలతో సహా 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తోంది.
దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.
సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. ఈ సారి అతను బీజేపీని టార్గెట్ చేసారు. బీజేపీని విషపూరిత పాము గా అభివర్ణించారు.