Home / తప్పక చదవాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు
సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు.
టీడీపీ, జనసేన పొత్తులపై మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లారనుకున్నామని అయితే ఓదార్చడానికి వెళ్లారా లేక బేరం కుదర్చుకోవడానికి వెళ్లారా అంటూ నాని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్ ది ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలిందన్నారు.
గూగుల్ మాతృసంస్ద ఆల్ఫాబెట్ తన గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుండి ఉద్యోగులను తొలగిస్తోంది, అయితే కొన్ని వందల మంది ఉద్యోగులను విడిచిపెట్టాలనే కంపెనీ నిర్ణయం విస్తృత స్థాయి తొలగింపులో భాగం కాదు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు సభకు హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గురువారం లోక్‌సభలోని తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ముఖ్యమైన శాసనసభ వ్యవహారాలను చర్చించడానికి మరియు ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇవ్వడానికి హాజరు కావాలని బీజేపీ తన ఎంపీలను కోరింది.
జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, నియామకం, కేంద్రం నిర్ణయించిన ఏదైనా ఇతర ప్రయోజనం కోసం కోసం జనన ధృవీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది అక్టోబర్ 1 (ఆదివారం) నుండి అమలులోకి వస్తుంది.
తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణ కీలకంగా మారింది.
టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ యొక్క కొత్త కేసును ధృవీకరించారు. దీనితో మొత్తం బాధిత వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరుకుంది.ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకిందని మంత్రి తెలిపారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను రక్షించగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.