Home / తప్పక చదవాలి
తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరులకు ముందుగా వందనం చేశారు. రజాకార్లపై పోరాడి అమరులయిన వారికి నివాళులు అర్పించారు.
జమ్ముకశ్మీర్ ఎన్ కౌంటర్లో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు.
చిన్నారుల గోప్యతను రక్షించడంలో విఫలమైనందుకు యూరోపియన్ రెగ్యులేటర్లు శుక్రవారం నాడు టిక్‌టాక్‌కి USD 368 మిలియన్ల జరిమానా విధించారు, యూరప్ యొక్క కఠినమైన డేటా గోప్యతా నియమాలను ఉల్లంఘించినందుకు ప్రసిద్ధ షార్ట్ వీడియో-షేరింగ్ యాప్‌కు శిక్ష విధించడం ఇదే మొదటిసారి.
: ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండు చేసింది.
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 8మంది నిందితులని పోలీసులు రిమాండుకి తరలించారు. వీరిని ఈ నెల 13న అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజీరియా దేశస్తులని అదుపులోకి తీసుకున్నాం పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు.. 16వ తేదీ రాత్రికే రాష్ట్రానికి రానున్నారు. రాత్రి 7గంటల 20 నిమిషాలకి శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా చేరుకుంటారు.
చైనా రక్షణ మంత్రి, లీ షాంగ్ఫు ప్రజల దృష్టి నుండి కనిపించకుండా పోయినందున, జపాన్‌లోని యుఎస్ రాయబారి రహ్మ్ ఇమాన్యుయేల్ ఇప్పుడు కమ్యూనిస్ట్ పాలన అతన్ని గృహనిర్బంధంలో ఉంచిందా అని ప్రశ్నించారు
బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన వ్యక్తిలో పంది కిడ్నీ సాధారణంగా రెండు నెలలపాటు పనిచేసి రికార్డు సృష్టించింది.NYU లాంగోన్ హెల్త్‌లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ రాబర్ట్ మోంట్‌గోమెరీ నేతృత్వంలోని ఈ ప్రయోగం బుధవారం ముగిసింది,
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల తరగతులను సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు.
హర్యానా లోని నూహ్ జిల్లాలో సెప్టెంబరు 15న ఉదయం 10 గంటల నుండి సెప్టెంబరు 16న రాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేయాలని ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. అదనంగా, ప్రభుత్వం మొత్తం జిల్లావ్యాప్తంగా సెక్షన్ 144 ని కూడా విధించింది. ప్రజలు తమ ఇళ్ల వద్దే శుక్రవారం ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం కోరింది.