IT Raids: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ నివాసాలపై ఐటీ దాడులు
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌తో పాటు అతనితో సంబంధం ఉన్న వారిపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ముంబైలోని 30కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం బుధవారం దాడులు ప్రారంభించింది.
IT Raids: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌తో పాటు అతనితో సంబంధం ఉన్న వారిపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ముంబైలోని 30కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం బుధవారం దాడులు ప్రారంభించింది.
పెట్టుబడిగా బ్లాక్ మనీ ..( IT Raids)
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్, సహరాన్‌పూర్, లక్నో, ఘజియాబాద్ మరియు మీరట్, పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ మరియు ముంబైలోని పలు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.జౌహర్ అలీ ట్రస్ట్‌లోని నిధుల దుర్వినియోగం మరియు రాంపూర్‌లోని జౌహర్ అలీ ఇనిస్టిట్యూట్ కోసం సేకరించిన భూమికి సంబంధించి అజం ఖాన్, అతని భార్య, కుమారుడు అబ్దుల్లా ఖాన్ మరియు ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. యూనివర్శిటీలో కొంత ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో పాటు ఆజం ఖాన్ నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టాడని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. గడిచిన మూడేళ్లలో ఎలాంటి ఆడిట్‌లు జరగనందున, యూనివర్సిటీ వేతన వ్యవస్థలో అవకతవకలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. అంతకుముందు, ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఆజం ఖాన్ నివాసాలపై దాడులు చేసింది.