Home / తప్పక చదవాలి
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విజయవాడ ఎసిబి కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నెల 25వ తేదీన మూడు పేజీల లేఖని జైలు అధికారుల ద్వారా ఎసిబి కోర్టు న్యాయమూర్తికి పంపించారు.
నిజం గెలిచింది కనుకే.. చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలవాలని ఉద్యమం చేస్తే.. చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర పై స్పందించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. తాను సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీచేస్తానని అన్నారు. గతంలో తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తనపై పోటీకి రాలేదు కాబట్టే నేను సిద్ధం అన్నారు.
ఇండియాకు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం మూతపడిన అల్ దహురా కంపెనీకి చెందిన ఈ ఉద్యోగులకు పాత్రకు సంబంధించి కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది.
రైతుల పేరుతో కొందరు రాజకీయాలు చేశారంటూ ప్రధాని మోదీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసారు. గురువారం షిర్డీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు చాలా ఏళ్లుగా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కాని రైతులకు ఏం చేశాడు? అంటూ ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తన నియోజకవర్గం దాతియా కోసం హేమ మాలిని డ్యాన్స్‌ను ఒక అభివృద్ది కార్యక్రమంగా లెక్కిస్తూ చేసిన ప్రసంగం యొక్క వీడియో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల ప్రచార సభలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరించారు. దాతియాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా 'హేమమాలినితో డ్యాన్స్ కూడా చేయించామని చెప్పారు.
: తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ మహువా మొయిత్రాపై క్యాష్ ఫర్ క్వెరీ అభియోగానికి సంబంధించి అక్టోబర్ 31న తన ముందు హాజరుకావాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తడానికి లంచం తీసుకున్నట్లు మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సమన్లు జారీ చేసింది. దీనిని రాజకీయ కుట్ర మరియు ప్రభుత్వ సంస్థల దుర్వినియోగంగా వైభవ్ గెహ్లాట్ పేర్కొన్నారు.
రాబోయే పదేళ్ళలో రాబోయే ప్రభుత్వం ఏ లక్ష్యాన్ని నిర్ధారించగలగాలో, ప్రజల అభీష్టమేమిటో అర్థం చేసుకుని పీపుల్స్ మేనిఫెస్టోని నవంబర్ 1వ తేదీకల్లా తయారు చేస్తామని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ప్రకటించారు.
తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 2018లో పోలింగ్ రోజు రైతు బంధు పంచారని ఈసారి కూడా అలాగే పంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.