Home / తప్పక చదవాలి
కేరళలోని కొచ్చిలోని కలమస్సేరి ప్రాంతంలోని కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన పలు పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత గంట వ్యవధిలో పలు పేలుళ్లు జరిగాయని కలమసేరి సీఐ విబిన్ దాస్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు.
పూటకో పార్టీలు, మాటలు మార్చే వాళ్లను నమ్మొద్దని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. పాలేరు చైతన్యవంతమైన గడ్డ. పాలేరులో కొన్ని నరం లేని నాలుకలు మనల్ని విమర్శిస్తున్నాయి. మాట మార్చినా.. సత్యం మారదు..కళ్ల ముందే కనిపిస్తుందని కేసీఆర్ అన్నారు.
బీసీల అభ్యున్నతికి, తెలంగాణ అభివృద్ధికి పాటుపడేది కేవలం బీజేపీ ఒక్కటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సూర్యాపేటలో జరిగిన జనగర్జన సభలో మాట్లాడిన అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించామని ప్రకటించారు.
సోషల్ మీడియా ఒక ప్రత్యేకమైన ప్రపంచం. ప్రపంచవ్యాప్తంగా మనం ఇంతకు ముందెన్నడూ చూడని వింత మరియు షాకింగ్ వీడియోలను ఇక్కడ చూస్తాము. తాజాగా ఓ వ్యక్తి తనను తాను కారుగా మార్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎల్ సాల్వడార్ ఆఫ్రికా లేదా భారతదేశం నుండి వచ్చే ప్రయాణీకుల నుంచి $1,000 రుసుమును వసూలు చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ కు వలసలను అరికట్టడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటోంది.
విదేశీ నిపుణులకు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లో తమ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఊరట నిచ్చే వార్త. అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక దశలో ఎంప్లాయ్ మెంట్ అధరైజేసన్ కార్డ్ మరియు ఇతర అవసరమైన ప్రయాణ పత్రాలను జారీ చేయాలని వైట్ హౌస్ కమిషన్ సిఫార్సు చేసింది.
: అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు జీవిత భాగస్వామి జీవించి ఉంటే రెండో పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదని, వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
మెక్సికో లో ఓటిస్ హరికేన్ అకాపుల్కోను తాకడంతో సుమారుగా 27 మంది మరణించగా నలుగురు గల్లంతయ్యారు. గంటకు 165 మైళ్ళ వేగంతో వీచిన గాలులతో, ఇళ్లు మరియు హోటళ్ల ధ్వంసమయి పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కమ్యూనికేషన్లు స్తంభించాయి.
గాజా స్ట్రిప్‌లో ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 50 మంది బందీలు మరణించారని హమాస్ ఉగ్రవాద సంస్థ పేర్కొంది, హమాస్ యొక్క సాయుధ విభాగం, అల్-కస్సామ్ బ్రిగేడ్స్ తన టెలిగ్రామ్ ఛానెల్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం రాత్రిపూట దాడి తరువాత ఈ ప్రకటన వచ్చింది.