Home / తప్పక చదవాలి
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదయింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
బంగ్లాదేశ్‌లోని వేలాది మంది గార్మెంట్ కార్మికులు సోమవారం కనీస వేతనాలను మూడు రెట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ నిరసనలు ఫ్యాక్టరీల ధ్వంసానికి దారితీయడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించి చెదరగొట్టారు,
అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టకపోతే, పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం వారిని దశలవారీగా బహిష్కరించడం ప్రారంభిస్తుందని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ సోమవారం తెలిపారు. అక్రమ వలసదారుల తొలగింపునకు పాకిస్థాన్ ఈ నెల అక్టోబర్ 31 తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది.
కేరళ ప్రార్దనా మందిరంలో పేలుళ్ల కేసులో నిందితుడు డొమినిక్ మార్టిన్, యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. కొచ్చిలోని తమ్మనంలోని తన అద్దె ఇంటి టెర్రస్‌పై మరియు అలువా సమీపంలోని పూర్వీకుల ఇంటిపై ట్రయల్స్ నిర్వహించినట్లు పోలీసులకు చెప్పాడు.
నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, తగులబెట్టారు. రాళ్లు విసిరి నివాసం వద్ద పార్క్ చేసిన కారును కూడా తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్ అతని బంగ్లాలో భారీ మంటలు, దాని నుండి పొగ చుట్టుపక్కల చుట్టూ వ్యాపించడం కనిపించాయి.
మెదక్ ఎంపి, దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని బిఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. గాయపడిన ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇంట్లో ఉన్న పాముని తరిమికొట్టడానికి ఒక కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. పాముకోసం పొగ బెట్టడంతో ఇంట్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి మరియు మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ తీర్పును న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం..