Home / తప్పక చదవాలి
ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీలకు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.బ్యాంక్ రుణ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
మణిపూర్ ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5 వరకు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. హోం శాఖ మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని వారంలోపు రెండుసార్లు పొడిగించడం గమనార్హం.హానికరమైన సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అక్టోబర్ నెలలో వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ గణనీయమైన రాబడి ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన రెండవ అత్యధికం కావడం విశేషం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది సంవత్సరానికి 13% గణనీయమైన వృద్ధిని సాధించింది.
విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ల మొదటి బృందం బుధవారం యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి ఈజిప్ట్‌కు బయలుదేరింది. ఈ తరలింపు ఈజిప్ట్, ఇజ్రాయెల్ మరియు హమాస్‌లతో కూడిన కతార్ మధ్యవర్తిత్వ ఒప్పందం ఫలితంగా వచ్చింది.