Last Updated:

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ భేటీ

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ భేటీ

 Pawan Kalyan: జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

చర్చలు కొనసాగుతున్నాయి..( Pawan Kalyan)

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామన్నారు. సుహృధ్బావంగా చర్చిస్తున్నామని తెలిపారు. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని.. రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉందన్నారు. దీనిపై మరోసారి మాట్లాడుకుంటామని వివరించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుతో భేటీ అనంతరం బీజేపీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. దీంతో తెలంగాణలో పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. చంద్రబాబుతో భేటీలోనూ కీలక అంశాలు ప్రస్తావనకి వచ్చాయి. ఏపీలో సీట్ల పంపకాల మీద చర్చ జరిగింది. 9వ తేదీన ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి సమావేశం జరుగనుంది.

కోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో 9వ తేదీ సమావేశానికి చంద్రబాబు దూరంగా ఉండనున్నారు. సమావేశంలో రాష్ట్ర స్థాయి కీలక నేతలంతా పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తంగా ఇరు పార్టీల నుంచి దాదాపు వెయ్యి మంది సమావేశానికి హాజరవుతారని సమాచారం. ఈ సమావేశంపై ఇప్పటికే కసరత్తులు మొదలయ్యాయి. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో జట్టు కడుతున్న జనసేనాని పొలిటికల్ వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ పోలింగ్ పూర్తయ్యాక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పై పవన్ కళ్యాణ్ దృష్టి సారించనున్నారు.