Home / తెలంగాణ
చినుకు పడితే చిత్తడి చిత్తడిగా ప్రధాన రహదారులు, పొంగి పొర్లే మురికి నాలాలు, ఎటు చూసిన బురదమయం, అంతకుమించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నాలాలు. ఇది భాగ్యనగరంలో నిత్యం చోటు చేసుకొనే తంతు.
అక్టోబర్ 16న గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా 503 పోస్టులకు గానూ మెుత్తం 2 లక్షల 86 వేల 51 మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. అయితే క్వశ్చన్ పేపర్ చాలా కఠినంగా, ప్రశ్నలు సివిల్స్ స్థాయిలో ఉన్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అని మంత్రి కేటిఆర్ మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో పేర్కొన్నారు
సీఎం కేసిఆర్ కు మరో షాక్ తగిలింది. తెరాస పార్టీకి చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన రూ. 80.65 కోట్ల రూపాయలు విలువైన స్ధిర, చర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది.
తెలంగాణాలో నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47మంది అభ్యర్ధులు నిలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు
ఎఐసిసి అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ అధ్యక్ష ఎన్నిక ఓటింగ్ సిబ్బంది పై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేసారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై తెరాస హైకోర్టు మెట్లెక్కింది. కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల సంఘాన్ని తెరాస ఇప్పటికే కోరింది
మునుగోడు ఉప ఎన్నికల అధికార పార్టీ తెరాసకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో మునగకుండా ఆ పార్టీకి విజయం తధ్యంగా మారింది. దీంతో పార్టీలోని కీలక శ్రేణులు మునుగోడులోనే మకాం వేసి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు
దేశలోని ప్రజలందరికి అరచేతిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకురావడమే డిజిటల్ బ్యాంకుల ఏర్పాటు ఉద్ధేశంగా కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆజాద్ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకుల్లో మూడు బ్యాంకులను తెలంగాణాలో ఏర్పాటు చేశారు.