Home / తెలంగాణ
భాగ్యనగరం జంట హత్యలతో మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన ఉప్పల్‌లో కలకలం రేపుతోంది. తండ్రికొడుకులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
మునుగోడు ఉపన్నిక తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఎవరకి ఈ నియోజకవర్గ పట్టం కడతారానా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మునుగోడు బైపోల్ కు సంబంధించి నామినేషన్ల పర్వం తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
అతను ఏం మాట్లాడిన సంచలనమే..అడపా, దడపా వస్తుంటారు. మాట్లాడిన రెండు మాటలు సంచలనంగా నిలుస్తుంటాయి. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. డబ్బులు ఎవరిచ్చినా, అది మీ డబ్బే..కాబట్టి తీసుకోండి అంటూ మునుగోడు ఓటర్ల నుద్దేశించి పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన అభిషేక్ బోయనపల్లి కస్టడీ ముగియడంతో సీబిఐ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఇంకా రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సీబిఐ కోర్టును అధికారుల కోరారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల్లో భాగంగా నేడు నేత్ర దర్శనంలో కనువిందుచేసిన శ్రీవారిని వీక్షించిన భాగ్యనగరవాసులు తన్మయత్నంలో మునిగిపోయారు.
మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడులో కుసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి కేటీఆర్ వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
తెలంగాణ తిరుమల ఆలయంగా విరాజిల్లుతున్న చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకోనే భక్తులను గుంతల పడ్డ రోడ్డు మార్గం గుబులు తెప్పిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రధాన రోడ్డు మార్గం నుండి బాలాజీ ఆలయానికి చేరుకొనే మార్గం చినుకు పడితే చిత్తడి నేలగా మారిపోతుంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.