Home / తెలంగాణ
గనుల అక్రమ తవ్వకాల (మైనింగ్) కేసులో 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ హైదరాబాదు సీబీఐ కోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గాలి జనార్ధన రెడ్డికి ధర్మాసనం షాకిచ్చిన్నట్లైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ నెల 15న కుటుంబంతో సహా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో పొంగిపొర్లుతున్న ఊకచెట్టు కాజ్వేను దాటేందుకు ప్రయత్నించిన తల్లీ కూతురు సహా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు
ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.
ఆదాయ సమీకరణ మార్గాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించిన ప్రభుత్వం. తాజాగా రాజీవ్ స్వగృహ సహా ఇతర ఆస్తుల అమ్మకం చేపట్టనుంది.
రాష్ట్రంలో మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తులం బంగారం ఇస్తామని కొందరు, 40వేలు క్యాష్ ఇస్తామంటూ మరికొందరు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇందంతా అఫీషియల్ కాదండోయ్ అంతా తెరచాటు రాజకీయమే. ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్న టాక్.
తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడమే తెరాస, భాజపా పార్టీల లక్ష్యమని టిపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు