Home / తెలంగాణ
రాజ్ భవన్ - ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ధర్మాసనం మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దనింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది.
తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం తీరు పైన పటారం-లోన లొటారం అన్న సామెతమాటున ఉందంటూ సర్కారి సూళ్లు ఎత్తి చూపుతున్నాయి. జంట నగరాల్లోని 181 ఉన్నత పాఠశాలలకు సంబంధించి దాదాపుగా రూ. 15లక్షలు విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నాయి.
ఖాతాదారుడికి విశేష సౌలభ్యాలు అందించాలన్నది బ్యాంకుల ఉద్ధేశం. కాని కొంతమంది సాంకేతికతను తెలివిగా తమకు అనుకూలించుకొని అప్పన్నంగా సొమ్ములు కొట్టేస్తుంటారు. సమయం చూసి దోచేస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి నింగికెగియనుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ అయిన ‘విక్రమ్-ఎస్’ను ప్రయోగించేందుకు హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’సిద్ధమైంది. ఈ రాకెట్ ద్వారా 3 కస్టమర్ పేలోడ్లను ఈనెల 12-16వ తేదీల్లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
తెరాస పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందుతుడు రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.