Home / తెలంగాణ
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ లను, వార్డు మెంబర్లను సంతలో పశువులను కొనుగోలు చేసిన్నట్లుగా అధికార పార్టీ తెరాస ప్రజాప్రతినిధులను కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాతిపల్లి, ఊకొండి గ్రామంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన సీఎం కేసిఆర్ పాలనపై ధ్వజమెత్తారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారంనాడు షోకాజ్ నోటీసులు పంపింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో . కర్ణాటక సరిహద్దులో ఉన్న గూడబెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభమయింది.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, దాసోజ్ శ్రవణ్, స్వామిగౌడ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
బిఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి' వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి బాధ కలిగిస్తోందని, మాట్లాడటానికి కూడ ఏమీ లేదని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.