Home / తెలంగాణ
TSPSC Group 1: పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని బండి సంజయ్, ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 5,7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు ధ్వంసం అయ్యాయి. షార్ట్ సర్య్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కి ఉచినచ్చని షాక్ తగిలింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల సమరానికి సి అనుకోవాల్సిన తరుణంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. కాగా తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికారంలో వస్తామని గెలుపు పైన అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉన్న క్రమంలో షాకింగ్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి.
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి.
మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలకు చెందిన స్వామి నారాయణ గురుకుల స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి తీవ్ర గాయలయ్యాయి. స్కూల్లో గతనెల 11తేదీన వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో విన్యాసాలు చేయించారు. ఈ క్రమంలోనే హానివర్ధన్ రెడ్డి అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
వికారాబాద్ జిల్లా లో కనీవినీ ఎరుగని రీతిలో వడగండ్ల వాన కురిసింది. ఎటు చూసినా వండగండ్లు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల మీద చోటు చేసుకుంటున్నాయి. అయితే, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ లో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇది వరకే ఈ నెల 11న కవిత తొలి విచారణకు హాజరైన సందర్భంలో కూడా ఇలాంటి వాతావరణం లేదు.