Last Updated:

TSRTC: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ప్రారంభమైన ఎలక్ట్రిక్ గరుడ బస్సులు

TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రైవేట్ రవాణాకు ధీటుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గ‌త సంవ‌త్స‌రన్న‌ర కాలంగా సంస్థ‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

TSRTC: ప్రయాణీకులకు గుడ్ న్యూస్..  ప్రారంభమైన ఎలక్ట్రిక్ గరుడ బస్సులు

TSRTC: టీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన ఏసీ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం.. ఈ- గరుడ బస్సులను ఆర్టీసీ సంస్థ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో పాటు ఎం.డి స‌జ్జ‌న‌ర్ తో క‌లిసి ఆయ‌న లాంఛ‌నంగా జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులు ఈ బస్సు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ గరుడ బస్సు..

టీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం ప‌ర్యావ‌ర‌ణ‌ హిత‌మైన ఏసీ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం.. ఈ- గరుడ బస్సులను ఆర్టీసీ సంస్థ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ తో పాటు ఎం.డి స‌జ్జ‌న‌ర్ తో క‌లిసి ఆయ‌న లాంఛ‌నంగా జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికులు ఈ బస్సు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.

టీఎస్ ఆర్టీసీ ప్రైవేట్ రవాణాకు ధీటుగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తుంది. దీంతో ఆర్టీసీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. గ‌త సంవ‌త్స‌రన్న‌ర కాలంగా సంస్థ‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన పర్యావరణహిత బస్సులను.. హెద‌రాబాద్‌లోని మియాపూర్‌లో సంస్థ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎం.డి స‌జ్జ‌న‌ర్ జెండా ఊపి ప్రారంభించారు.

పర్యావరణ అనుకూల ప్రజా రవాణా కోసం ఈ బస్సులను ప్రవేశపెట్టడం జరిగిందని సంస్థ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవ‌ల కాలంలో టి.ఎస్‌.ఆర్టీసీ కొత్త‌గా సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ స్లీప‌ర్ మొత్తం 760 బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.