Home / తెలంగాణ
Power Consumption: విద్యుత్ వినియోగంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. తెలంగాణ చరిత్రలో మంగళవారం (నేడు) ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలల అనుకున్నదాని విధంగానే 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది.
TSPSC Leak: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇదివరకే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న నిరంతర కృషీవలుడు పవన్ కళ్యాణ్. వాటన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం నిలబడ్డారు ఈ జనసేనాని.
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. "దిగ్విజయ భేరి" పేరుతో జరగనున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.
పవన్ కళ్యాణ్ సారధ్యం లోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు.
మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసారు.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.
MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Dharmapuri Arvind: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని అర్వింద్ హితవు పలికారు.