Last Updated:

Nadendla Manohar: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిన రేషన్ బియ్యం.. మంత్రి నాదెండ్ల మనోహర్

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక, హెచ్ 1 గోడౌన్ లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nadendla Manohar: కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిన  రేషన్ బియ్యం.. మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక, హెచ్ 1 గోడౌన్ లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. షిప్పింగ్ ఆపేయమని పోర్ట్ అధికారులను ఆదేశించారు.

సీఐడీ విచారణ జరిపిస్తాం..(Nadendla Manohar)

ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పేద ప్రజల పొట్ట కొట్టి బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేసి కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని ఆరోపించారు. దీనిపై జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లై ఎండీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీకి కొందరు అధికారులు కూడా సహకరించారని విమర్శించారు. రేషన్ అక్రమాలపై సీఐడీ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడలో 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని తెలిపారు.గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.36,300 కోట్లు అప్పులు చేసి రైతులకు చెల్లించాల్సిన రూ.1600 కోట్లు చెల్లించకుండా వదిలేసిందన్నారు ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి త్వరలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని కౌలు రైతులకు మేలు చేస్తాం. అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు.

 

 

ఇవి కూడా చదవండి: