Home / ప్రాంతీయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.
మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ వన్ టౌన్లో వాలంటీర్ల ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ పోచారం నివాసాన్ని సందర్శించారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. రెండున్నరేళ్ల క్రితం అంటే 2021 నవంబర్ 19న ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తీవ్రంగా కించపరిచారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు మహిపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
రుషికొండలోని భవనాలు జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ భవనాల్లో, గెస్ట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం జగన్ కు లేదన్నారు
ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటల్స్ లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.