Home / ప్రాంతీయం
డీఎస్సీ పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. డీఎస్సీ పరీక్షల హాల్ టిక్కెట్లు ఇప్పుడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యా శాఖ ప్రకటించిన అధికారిక వెబ్సైట్ నుండి తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏపీలో ప్రభుత్వం మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ టైం వచ్చింది. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకరోజు పర్యటనను ప్రారంభించారు. ముందుగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో .. పోలవరం ఎడమ కాల్వను ఆయన పరిశీలించారు
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. కందిపప్పు, బియ్యం విక్రయాలు కౌంటర్లు ప్రారంభం అయ్యాయి. నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు
విశాఖపట్నం, తిరుపతి జూలాజికల్ పార్కులను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది సందర్శకులను ఆకట్టుకునేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఎర్రచందనం దొంగలను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థులపై దురుసుగా ప్రవర్తించారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయబోతున్న బీఆర్ఎస్వీ నేతలపై లాఠీచార్జ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలంటూ పలికి మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని... అలాగే వారు చెప్పినట్లుగా పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ... కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.