Home / ప్రాంతీయం
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వివిధ హోదాల్లో సెక్రెటరీలుగా పనిచేసిన దాదాపు 10 మంది ఐఏఎస్ లు ఈరోజు విచారణకు హాజరయ్యారు . కాగా వీరి హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అందుకు గల కారణాలను కమిషన్ అడిగి తెలుసుకుంది.
తెలంగాణలో రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేయనున్నారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేశారు.
బోనాల పండుగ చెక్కుల పంపిణీ సందర్భంగా అధికారులు ప్రోటోకాల్ ను ఉల్లంఘించారంటూ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. మహేశ్వరంలోని ఆర్కేపురం డిజవిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలకు ఆలయ కమిటీలకు చెక్కుల పంపిణీ సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి.. దేశంలోనే ఒక రికార్డు నెలకొల్పామని.. జనసేన అదినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆయన మాట్లడారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అక్రమ అబార్షన్లు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్లారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్వహించారు.. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ్ దెబ్బకి గులాబీ పార్టీ చతికిలపడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరుతుండడంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది
తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే పునరుద్ధరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరారు. నాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని గత పరిపాలనలో ఏర్పాటైన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రస్తుత పరిస్థితిపై హరీశ్‌రావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు అని, వెంటనే ప్రారంభించాలని ఆయన సామాజిక మాధ్యమం x లో డిమాండ్ చేశారు.