Last Updated:

Murder News : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యమార్చిన మాజీ వాలంటీర్.. ఎలా, ఎక్కడంటే ?

ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

Murder News : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్యమార్చిన మాజీ వాలంటీర్.. ఎలా, ఎక్కడంటే ?

Murder News : ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. కాగా మొదట అనుమానాస్పద మృతిగా అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో షాక్ అయ్యే నిజాలు వెళ్లాడయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పీలేరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కిషోర్ గతంలో వాలంటీర్ గా పనిచేసేవాడు. కాగా స్థానికంగా నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ సుధాకర్ భార్య అశ్వినితో కిషోర్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అశ్వినిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్ చేసిన కిషోర్ ఆమె భర్త ఆటో డ్రైవర్ సుధాకర్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ మేరకు గత నెల 31 న డేట్ ఫిక్స్ చేసుకున్న కిషోర్ ఈ మేరకు మరో ముగ్గురు స్నేహితుల సహకారంతో ప్లాన్ అమలు చేశాడు.

తిరుపతికి చెందిన చందు, ప్రసాద్, సునీల్ అనే తన ముగ్గురు స్నేహితులతో కలిసి సుధాకర్ హత్యకు ప్లాన్ చేసిన కిషోర్ ఆగస్టు 31 న ఆటోలో కొటపల్లి వద్ద కూతుర్ని స్కూల్ కి తీసుకెళ్లి వదిలి తిరిగి ఆటోలో వస్తున్న సుధాకర్ ని ఆపి ఆటోలో ఎక్కిన ముగ్గురు వెనుక వైపు నుంచి సుధాకర్ మెడపై సైనేడ్ ఇంజక్షన్ గుచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన  కాసేపటికే సుధాకర్ మరణించాడు. ఈ మేరకు భార్య అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి రోడ్డులో ఆయిల్ సీడ్స్ ఫ్యాక్టరీ వద్ద కిషోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లు నిర్ధారించారు.

ప్రియురాలు అశ్విని కోసం ఆమె భర్త సుధాకర్ ను హత్య చేసేందుకు సైనేడ్ దాడికి పాల్పడిన నిందితుడు కిషోర్ అంగీకరించినట్లు తేల్చారు. ఆటో డ్రైవర్ సుధాకర్ భార్య అశ్వినితో కిషోర్ కు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కిషోర్‌ను అదుపులో తీసుకున్న పోలీసులు.. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.