Home / ప్రాంతీయం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 28నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకి సెలవులున్నాయి. విచారణ వాయిదా పడినా లేదా ఆలస్యం అయినా చంద్రబాబు కేసు అక్టోబర్ 3 తరువాతే తేలే అవకాశాలుంటాయి.
పవన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతీసి కొడతానని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వమన్నారు. ప్రజా సేవకులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని స్పష్టం చేసారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రిమాండుని అక్టోబర్ 5 వరకూ విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. నేటితో సిఐడి రెండు రోజుల కస్టడీ ముగిసింది. చంద్రబాబు విచారణకి సహకరించలేదని అంటున్న సిఐడి అధికారులు చంద్రబాబుని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని నిర్ణయించారు.
తిరుమలలో గుర్తు తెలియని దుండగులు ఉచిత ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేశారు. తిరుమల గ్యారేజ్ నుండి చోరీ చేసి అందులోనే చక్కర్లు కొట్టారు. జిపిఆర్ఎస్ సిస్టం ద్వారాబస్సును గుర్తించిన పోలీసులు లోకేషన్ ద్వారా ట్రేస్ చేసి బస్ను స్వాధీనం చేసుకున్నారు.
:జనసేన, టీడీపీ, బీజేపీ రాజ్యాధికారం చేపట్టాలని కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. పెత్తనం సాగిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గద్దె దించాలని కోరారు. అన్నీ కులాలు ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.పాలకొల్లు కాపు సంక్షేమ సేన విస్తృతస్దాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
డ్రగ్స్ కేసు ఉదంతం ఎప్పుడు తెరపైకి వచ్చినా అందులో నటుడు నవదీప్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మాధాపూర్ డ్రగ్స్ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాదాపూర్ హైటెక్ సిటీ లో 2 భారీ భవనాల కూల్చివేయడం జరిగింది. మాదాపూర్ మైండ్ స్పేస్లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి, న్యాయమూర్తి సత్య వెంకట హిమబిందుకు బాబు