Home / ప్రాంతీయం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకి సంబంధించిన వాదనలు జరుగనున్నాయి. ఢిల్లీలో లాయర్లతో నారా లోకేష్ సంప్రదింపులు జరపాల్సి ఉంది.
భరత జాతి చైతన్యమూర్తి భగత్ సింగ్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భరత జాతిలో పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు షహీద్ భగత్ సింగ్‌ను ఆసేతు హిమాచలం గుండెల్లో పెట్టుకుందన్నారు. తెల్లవారి దాష్టీకాలను ఎదిరించిన ఆ వీరుని జయంతి సందర్భంగా సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పవన్ తెలిపారు.
ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై హోంమంత్రి అమిత్ షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉల్లంఘించారంటూ ఆధారాలు సమర్పించారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి సిఐడి చీఫ్ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ స్టంట్ మాస్టర్స్‌లో బద్రి ఒకరు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తూ.. తన ఫైట్స్‌తో, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు బద్రి. తాజాగా బద్రి.. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన పార్టీ కోసం విరాళాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం వైభంగా కొనసాగుతుంది. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్మండ్ విల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.
ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం సాగనంపుతున్నారు. ఇక ఈ క్రమం లోనే ఇప్పటికే నిమజ్జన కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా హైదరాబాద్ నగరంలో
వినాయక చవితి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ వైపు తీసుకువస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు పాలకపక్షం, మహిళా కమిషన్ ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ తరుపున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల అదృశ్యం గురించి
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తాజాగా భారీ వర్షం కురిసింది. నగరంలోని అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్ పురా, యాకత్పురా, చాంద్రాయణగుట్ట, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద నీరు
తెదేపా చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 5 వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టు ప్రారంభం అయిన తర్వాత సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు