Home / ప్రాంతీయం
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధనకోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇకపై తాను వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ జీవితం ఉంటుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 80 డీజిల్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టిఆర్ మార్క్ వద్ద ఈ బస్సులని రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించారు. వీటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని, 20 లహరి బస్సులున్నాయి.
ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడి కొండల వెంకటేశ్వరరావు శుక్రవారం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ రాఘవేంద్ర రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు ఆయనను ఘనంగా సత్కరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు సందర్శించారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డకు వెళ్లారు. అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజుసమీక్షలు నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్ట్ బ్రేక్ వేసింది. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ ను క్యాన్సల్ చేస్తూ తీర్పునిచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్సిపిలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ క్రికెటర్ రాయుడికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబటి రాయుడు గత కొద్దకాలంగా ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పధకాలకు తన మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపుల విరోధి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. వైసిపి సర్కార్ కాపు వ్యతిరేక విధానం చూస్తుంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమైపోతోందని జోగయ్య చెప్పారు.