Last Updated:

Ayyannapatrudu : సీఎం జగన్ శాడిస్టు నా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు.. అయ్యన్నపాత్రుడు

సీఎం జగన్ శాడిస్టునా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..

Ayyannapatrudu : సీఎం జగన్ శాడిస్టు నా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు.. అయ్యన్నపాత్రుడు

Ayyannapatrudu: సీఎం జగన్ శాడిస్టునా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..వైసిపి బారి నుండి ఉత్తరాంధ్ర ను కాపాడుకుందాం అనే నినాదంతో విశాఖ టిడిపి కార్యాలయం లో ఉత్తరాంధ్ర చర్చా వేదిక సమావేశం లో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అమరావతే రాజధాని అని జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటేయలేదా..? అని ఆగ్రహించారు. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అంటుంటే.. ఈ తుగ్లక్ నాకొడుకు మూడు రాజధానులంటున్నాడు. విశాఖ ఆర్ధిక రాజధాని అని చంద్రబాబు ఎప్పుడో చెప్పారు. విశాఖ భూములని తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 25 వేల కోట్లు ఏమయ్యాయి..? అన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోసును జగన్ లాగేసుకున్నారు.తమను బెదిరించి రాయించేసుకున్నారని సురేష్ బాబు చెప్పారని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.

మనం నవ్వుతూ ఏడుస్తూ ఉంటాడు.. మనం ఏడుస్తూ ఉంటూ నవ్వుతూ ఉంటాడు శాడిస్ట్ నా కొడుకు సీఎం అంటూ అయ్యన్న మండిపడ్డారు. మిగతా వైసీపీ నేతలంటే పిల్ల నా కొడుకులు.. ధర్మాన, బొత్సలకు ఏమైంది..? ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడే ధర్మాన, బొత్స ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు.సజ్జల స్క్రిప్ట్ రాసిస్తే మంత్రులు ధర్మాన, బొత్స మాట్లాడుతున్నారు. సీనియర్లగా మీకు బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కాలేజీ, ఐటీఐ, సర్యూట్ హౌస్ , గోపాలపట్నం రైతుబజార్ 25 వేల కోట్లకు తనఖా పెట్టేసారని అయ్యన్న ఆరో్పించారు. చోడవరం ఎమ్మెల్యే బుడబుక్కలగాడు రాజీనామా చేసాడట. మరి స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు రాజీనామా చేయలేదని అడిగారు. ఆ రో్జు అసెంబ్లీలో అమరావతికి మద్దతు పలికిన ఓ మూర్క్షుడా ఇపుడు మూడు రాజధానులంటావేంట్రా అంటూ అయ్యన్న సెటైర్లు వేసారు.

జగన్ కు ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్ప పరిపాలనా అనుభవం లేదన్నారు. రాజధానికి, ఆర్దిక రాజధాని వేరు అని అయ్యన్న అన్నారు.దేశానికి ఢిల్లీ రాజధాని అయితే ముంబయ్ ఆర్దిక రాజధాని అని అలాగే విశాఖపట్నం కూడ ఆర్దికరాజధాని అన్నారు. అమరావతి ఎమ్మెల్యేల పాదయాత్రకు తోటి రైతులుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో వారి యాత్ర నర్పీపట్నంలో ఎంటరవుతుందని వారికి కావలసి అన్ని రకాల సహాయసహకారాలు తాను అందిస్తానని అన్నారు. అదేవిధంగా మిగిలిన వారు కూడ ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలo అశోక్, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ రామారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి: