Last Updated:

viveka murder case: వివేకా హత్య కేసు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఎప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని పేర్కొంది.

ఆలస్యం చేయకండి.. సుప్రీం ఆదేశాలు

వైస్ వివేకా హత్యపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఎప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని పేర్కొంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని తెలిపింది. గతంలో ఇదే కోర్టు వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. 6 నెలల్లో కోర్టు ట్రయిల్ ప్రారంభించాలి లేదంటే నిందితుల రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకుంటున్నాం అని సుప్రీం కోర్టు పేర్కొంది.

వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం విచారిస్తారని ఇదివరకే సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీం కీలక ఆదేశాలు..

ఈ కేసులో ఈ హత్యకు గల ప్రధాన కారణాలను.. ఉద్దేశాలను బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కీలక విచారణాధికారిని మార్చండి.. లేదా ఇంకొక అధికారిని నియమించండి అంటూ సుప్రీం అసహానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సీబీఐ దాఖలు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. కేసు అంతా.. రాజకీయ శత్రుత్వంతో జరిగిందని రిపోర్ట్‌లో రాశారని న్యాయమూర్తి పేర్కొన్నారు. మెరిట్స్‌ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్‌ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే.