Last Updated:

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబుకు అస్వస్థత… జైలుకి వెళ్లి పరిశీలిస్తున్న ప్రభుత్వ వైద్యులు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో... జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు.

Nara Chandrababu Naidu : తెదేపా అధినేత చంద్రబాబుకు అస్వస్థత… జైలుకి వెళ్లి పరిశీలిస్తున్న ప్రభుత్వ వైద్యులు

Nara Chandrababu Naidu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్నిరోజులుగా విపరీతమైన ఉక్కపోత, వేడిమి నెలకొని ఉండడంతో… జైల్లో చంద్రబాబు డీహైడ్రేషన్ తో బాధపడుతున్నారు. అధిక వేడిమితో ఆయన అలర్జీకి గురయ్యారు. ఈ నేపథ్యంలో, జైలు అధికారులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించారు.

దాంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్యులు జైలులోకి వెళ్లారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కేసులో  సీఐడీ దాఖలు చేసిన  పీటీ వారంట్ కు  ఏసీబీ కోర్టు గురువారం నాడు ఆమోదించింది.  ఈ నెల  16న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరు పర్చాలని  జడ్జి ఆదేశించారు.సోమవారం నాడు  ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటలలోపు  కోర్టు ముందు చంద్రబాబును  ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఆదేశించింది ఏసీబీ కోర్టు.   రేపు చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పులు వస్తే  జోక్యం చేసుకోవచ్చని  చంద్రబాబు తరపు న్యాయవాదులకు  ఏసీబీ కోర్టు సూచించింది.