AP Government: హైకోర్టు తీర్పుకు ఓకే చెప్పిన ప్రభుత్వం
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టు అక్షింతలు తప్పడం లేదు. పాలనకు వ్యతిరేకంగా వెళ్లాలని అనుకొంటున్న జగన్ ప్రభుత్వానికి ఏపి ఉన్నత న్యాయస్ధానము ఎప్పటికప్పడు లాక్ లు వేస్తూనే ఉంది
Amaravati: తాజాగా ఆపివేసిన దుల్హన్ పధకాన్ని వచ్చే నెల 1నుండి అమలు చేస్తున్నట్లు ఏజీ హైకోర్టుకు జీవో నెంబరుతో సహా సమర్పించారు. వివరాల మేరకు ఏపీ ప్రభుత్వం దుల్హన్ పధకాన్ని అమలు చేయడం లేదంటూ మైనార్టీ పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకు దుల్హన్ పథకం అమలు చేయడం లేదంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది.
అర్హులకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకూ దుల్హన్ పథకం కింద ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దుల్హన్ పథకం అమలు చేయాలని న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది. దుల్హన్ పథకం అమలులో మీరు విజయం సాధించారని పిటిషనర్ తరుపు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయస్థానం ఆదేశాలతో పిటిషనర్స్ లో హర్షం వ్యక్తం అయింది.