Home / తాజా వార్తలు
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై దర్యాప్తునకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం కొట్టివేసింది.
కట్టుకున్న భర్త మరో మహిళతో చనువుగా ఉంటేనే ఇల్లాలు తట్టుకోలేదు. అటువంటిది భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే దగ్గరుండి చేయించడం చిన్న విషయం కాదు.
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీని ఇవాళ ప్రారంభించారు.
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకినాడ పోర్టులోని గోడౌన్ పరిశీలించారు. రేషన్ బియ్యం ఉన్న అశోక, హెచ్ 1 గోడౌన్ లను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ పదవీకాలాన్ని రెండు నెలలు పొడిగించారు. మేడిగడ్డ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లోని రెండు బ్యారేజీల నిర్మాణంపై ఈ కమిషన్ విచారణ జరుపుతోంది. దీనిపై హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాల్లో కమిషన్ పలు దఫాలు పర్యటించింది.
హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా 2024లో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో ప్రెసిడెంట్ జో బైడెన్ పెర్ఫార్మెన్స్ పేలవంగా ఉందన్న వార్తలు పచ్చిన నేపధ్యంలో అతడిని అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు దారి పొడగునా.. అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కేరింతల మధ్య.. పవన్ కొండగట్టుకు చేరుకుని.. అంజన్నను దర్శించుకున్నారు