Last Updated:

Vijay Devarakonda: నా ప్రేమ గురించి అప్పుడే బయటపెడతా – డేటింగ్‌పై విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌

Vijay Devarakonda: నా ప్రేమ గురించి అప్పుడే బయటపెడతా – డేటింగ్‌పై విజయ్‌ దేవరకొండ రియాక్షన్‌

Vijay Devarakonda Reaction on Dating Rumours ‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ డేటింగ్ వార్తలపై స్పందించాడు. కాగా కొంతకాలంగా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్‌ ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు వీరిద్దరు డేటింగ్‌కి, వెకేషన్‌కి వెళ్లిన ఫోటోలు నెట్టింట దర్శనం ఇచ్చాయి. ఈ ఫోటోలు బయటకు వచ్చిన ప్రతిసారి వీరి డేటింగ్‌ రూమర్స్‌ వార్తల్లో నిలుస్తున్నాయి. రీసెంట్‌గా కూడా ఓ హోటల్లో వీరిద్దరు లంచ్‌ చేస్తున్న ఫోటో లీక్‌ అయ్యింది.

రష్మికతో డేటింగ్?

అయితే ఇది చూస్తున్నప్పుడల్లా ఇవి లీక్‌ అవుతున్నాయా? వారే లీక్ చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. పరోక్షంగా కూడా వీరిద్దరు ఎన్నోసార్లు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. దీంతో రష్మిక, విజయ్‌ దేరకొండలు రిలేషన్‌లో ఉన్నారనేది రూమర్‌గానే ఉన్నా.. వారి తీరు చూస్తుంటే మాత్రం వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారనేది కన్‌ఫాం అంటున్నారు సన్నిహితవర్గాలు. దీనికి వారిద్దరు ఎప్పుడెప్పుడు బయటపెడతారా? అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విజయ్‌ దేవరకొండ తన డేటింగ్‌ వార్తలపై ఊహించని కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు తన ప్రేమ విషయాన్ని తానే బయటపెడతానంటూ షాకింగ్‌ కామెంట్స్ చేశాడు.

అప్పుడే బయటపెడతా

“నా ప్రేమ విషయాన్ని సమయం వచ్చినప్పుడు చెబుతాను. దానికి నేను ఇంకా సిద్ధంగా లేను. ఆ సమయంలో వచ్చినప్పుడు నేనే బయటపెడతా. నా ప్రేమ గురించి ప్రపంచానికి తెలియాలి, అందరితో పంచుకోవాలని నాకు అనిపించినప్పుడు తప్పకుండ చెప్పేస్తా. దానికంటూ ఒక ప్రత్యేకం సమయం, కారణం ఉండాలి. కాబట్టి ఆ రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరితో షేర్ చేసుకుంటాను. సాధారణం పబ్లిక్‌ ఫిగర్‌లా వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. అలాగే నా గురించి కూడా తెలుసుకోవాలని ఆసక్తి కూడా చూపిస్తుంటారు. దానిని నేను వృత్తిలో భాగంగానే చూస్తా. ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తాను” అని చెప్పుకొచ్చాడు.

అంతే బాధ కూడా ఉంటుంది

అలాగే ప్రేమపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో తెలియదు. ఉంటే మాత్రం దానితో పాటు బాధ కూడా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం అమితంగా ప్రేమిస్తే అంతే బాధ కూడా మోయాల్సి వస్తుంది” అని పేర్కొన్నాడు.  ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కామెంట్స్ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉంటే గతంలో విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లిపై ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అలాగే ఆయనపై ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. 2025లో విజయ్‌ దేవరకొండ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ చూస్తుంటే అవే నిజమయ్యేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే 2025లో విజయ్ రష్మిక తన ప్రేమ వ్యవహరాన్ని బయటపెట్టి, పెళ్లి ప్రకటన ఇస్తాడేమో అని అభిమానులంతా అభిప్రాయపడుతున్నారు.