Last Updated:

Today Horoscope January 29: నేటి రాశి ఫలాలు.. మౌనీ అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు!

Today Horoscope January 29: నేటి రాశి ఫలాలు.. మౌనీ అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు!

Horoscope Today in Telugu January 29: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. అలాగే ఈరోజు మౌనీ అమావాస్య. మాఘ కృష్ణ అమావాస్య రోజున‌.. మౌనీ అమావాస్య అంటారు. సాధకులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే జప, తప, నదీ స్నాన కర్మలకు విశేష ఫలం సిద్ధిస్తుందనేది హిందువుల విశ్వాసం.

మేషం – కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు. కుటుంబంలో స్వల్పమైన మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వృషభం – వృత్తి వ్యాపారాలపరంగా సాధారణ ఫలితాలు ఉంటాయి. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకో గలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు.

మిథునం – కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి.రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాల నిస్తాయి. శుభకార్యాలలో పరిచయాలు కొత్త మిత్రత్వానికి దారి తీస్తాయి.

కర్కాటకం – ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందు కోసం కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తారు. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో వెలగడం చెప్పదగినది.

సింహం – ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి.

కన్య – శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది.

తుల – మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి. అన్నింటిలో సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది.

వృశ్చికం – నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు.ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందుపుచ్చుకోండి. శుభకార్య చర్చలు శుభకార్య ప్రసంగాలు సాగిస్తారు.

ధనుస్సు – పరిస్థితులను చాలా వరకు చక్కబరుస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాలపట్ల ఆకర్షితులు అవుతారు. స్వల్పకాలిక వ్యాపారాలను ప్రారంభిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

మకరం – మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. సున్నితమైన వ్యవహారాలను వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోగలుగుతారు.

కుంభం – దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.యత్నకార్యసిద్ది పొందుతారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది.స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి: