Last Updated:

Lucknow court Firing: లక్నో కోర్టు వద్ద కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా మృతి

ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు వెలుపల గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను బుధవారం ఒక వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన కోర్టు హౌస్ వెలుపల జరిగింది, అక్కడ దుండగుడు కాల్పులు జరిపడంతో సంజీవ్ జీవా చనిపోగా ఒక యువతి గాయపడింది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కి సన్నిహితుడయిన సంజీవ్ మహేశ్వరి జీవా, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందితుడు.

Lucknow court Firing: లక్నో కోర్టు వద్ద కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా మృతి

Lucknow court Firing: ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు వెలుపల గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను బుధవారం ఒక వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన కోర్టు హౌస్ వెలుపల జరిగింది, అక్కడ దుండగుడు కాల్పులు జరిపడంతో సంజీవ్ జీవా చనిపోగా ఒక యువతి గాయపడింది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కి సన్నిహితుడయిన సంజీవ్ మహేశ్వరి జీవా, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందితుడు.

లాయర్ వేషంలో వచ్చి..(Lucknow court Firing)

షూటర్ లాయర్ వేషంలో కోర్టుకు వచ్చి సంజీవ్ జీవాపై కాల్పులు జరిపాడని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. సంజీవ్ జీవాను హత్య చేసిన దుండగుడిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విజయ్ యాదవ్‌గా గుర్తించారు.స్వయంగా షూటర్ అయిన జీవా, క్రిమినల్ కేసులో విచారణ కోసం లక్నో కోర్టుకు తీసుకురాబడ్డాడు. అతనిపై పలు ఇతర క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి.

ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం లక్నో సివిల్ ఆసుపత్రికి తరలించారు.మరోవైపు కాల్పుల నేపథ్యంలో లక్నో కోర్టులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.కాంపౌండర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సంజీవ్ జీవా చివరికి అండర్ వరల్డ్‌కు దగ్గరయ్యాడు. అతను 2018లో బాగ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు హత్యకు గురైన మున్నా బజరంగీకి సన్నిహితుడు అని కూడా చెప్పబడింది.