Last Updated:

iPhone SE 4: ఆపిల్ భారీ స్కెచ్.. బడ్జెట్ ప్రైస్‌లో ఐఫోన్ లాంచ్.. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లకు చుక్కలే!

iPhone SE 4: ఆపిల్ భారీ స్కెచ్.. బడ్జెట్ ప్రైస్‌లో ఐఫోన్ లాంచ్.. ఇక ఆండ్రాయిడ్ ఫోన్లకు చుక్కలే!

iPhone SE 4: ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ సెప్టెంబర్‌లో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో కంపెనీ 4 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను తీసుకురానుంది.  Apple లవర్స్ రాబోయే iPhone SE 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు Apple iPhone 16 సిరీస్‌తో పాటు iPhone SE 4 లాంచ్ అవుతుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇది జరగలేదు. ఇప్పుడు ఈ కొత్త ఐఫోన్‌కు సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది.

iPhone SE 4కి సంబంధించి చాలా కాలంగా లీకులు వస్తున్నాయి. ఇందులోని పలు ఫీచర్లు కూడా లీక్స్‌లో వెల్లడయ్యాయి. ఇప్పుడు దాని లాంచ్‌కు సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. తాజా నివేదిక ప్రకారం ఆపిల్ 2025 ప్రారంభ నెలల్లో ఐఫోన్ SE 4 ను మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఇటీవల బ్లూమ్‌బెర్గ్ నివేదికలో ఆపిల్ రాబోయే SE 4 ఐఫోన్‌ను మార్చి 2025 నాటికి విడుదల చేయవచ్చని నివేదించిందిం. ఇది మాత్రమే కాకుండా కంపెనీ ఐఫోన్ SE 4 తో పాటు iPad Airని కూడా మార్కెట్‌లోకి తీసుకురావచ్చు.  ఈసారి iPhone SE 4 లో పెద్ద మార్పులు చూడవచ్చు. కంపెనీ SE మోడల్ నుండి హోమ్ బటన్‌ను తీసివేయచ్చు. హోమ్ బటన్‌కు బదులుగా వినియోగదారులకు ఫేస్ ఐడి ఫీచర్ ఇవ్వచ్చు.

iPhone SE4 Features
మీడియా నివేదికల ప్రకారం.. ఐఫోన్ SE 4లో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.  కంపెనీ  iPhone SE 4ని 2025లో లాంచ్ చేయచ్చు. ప్రస్తుతం లాంచ్ తేదీకి సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.  ఇది ఐఫోన్ 16 సిరీస్ కంటే చాలా చౌకైన స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఇందులో మీకు OLED డిస్‌ప్లే ఉంటుంది.

దీనిలో మీరు 48 మెగాపిక్సెల్ కెమెరాను చూస్తారు.  తక్కువ కాంతిలో అద్భుతమైన ఫోటోగ్రఫీ చేయగలుగుతారు. ఇది కాకుండాఈ స్మార్ట్‌ఫోన్‌లో  సెల్ఫీ,  వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇందులో మీకు ఐఫోన్ 14కి సమానమైన బ్యాటరీని ఇవ్వవచ్చు.

డిస్‌ప్లే గురించి మాట్లాడితే ఇది 2532×1170 పిక్సెల్స్‌తో 6.1 అంగుళాల డిస్2పస్లేని కలిగి ఉంటుంది. దీనిలో OLED ప్యానెల్  1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది.  డిస్‌ప్లేను ప్రొటక్డ్‌గా ఉంచడానికి  అందులో సిరామిక్ షీల్డ్ అందించారు . iPhone SE 4 iOS18కి మద్దతుతో రానుంది.