Last Updated:

Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో శతాబ్ది వృద్ధుడు.. ఎక్కడంటే?

నేపాల్ దేశంలో ఈ నెల 20న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో తమ తమ అభ్యర్ధులతో పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలో వందేళ్ల ఓ వృద్దుడు కూడా ఎన్నికల పోటీలో నిలబడి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

Tika Dutta Pokharel: ఎన్నికల బరిలో శతాబ్ది వృద్ధుడు.. ఎక్కడంటే?

Nepal: నేపాల్ దేశంలో ఈ నెల 20న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో తమ తమ అభ్యర్ధులతో పోటీకి సై అంటున్నారు. ఈ క్రమంలో వందేళ్ల ఓ వృద్దుడు కూడా ఎన్నికల పోటీలో నిలబడి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

వివరాల్లోకి వెళ్లితే, నేపాలీ కాంగ్రెస్ (బీపీ) పార్టీ తరపున టికా దత్తా పోఖారెల్ అనే వ్యక్తి గోర్ఖా-2 నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్ధుల్లో ఒకరైన నేపాల్ మాజీ ప్రధాని, మావోయిస్ట్ పార్టీ నేత పుష్పకమల్ దహల్ (ప్రచండ) కూడా పోటీ చేస్తున్నారు. దత్తా పోఖారెల్ ఆరోగ్యంగా ఉన్నాడని, చలాకీగా నడుస్తూ, రెండు రోజుల క్రితమే 99ఏళ్ల జన్మదినాన్ని కూడా జరుపుకొన్నాడని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ సందంర్భంగా శతాబ్ది వృద్ధుడు నేపాల్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో నిజమైన నాయకుడు లేడన్నాడు. నాయకులుగా జబ్బలుదరుచుకొనే వారంతా డబ్బు సంపాదనం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. హక్కులు కల్పన, దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే నేను ఎన్నికల బరిలో నిలబడిన్నట్లు చెప్పడం అందరిని ఆకట్టుకొంటుంది. కాగ, తాను మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తారని గుండె నిబ్బరంతో మాట్లాడడాన్ని స్థానిక ఓటర్లు చర్చించుకొంటున్నారు. 2017 ఎన్నికల్లో సుమారుగా 29వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనివున్నారు.

ఇది కూడా చదవండి: Immigration Check: సీపీఐ నారాయణకు ఫ్లోరిడాలో చేదు అనుభవం

ఇవి కూడా చదవండి: