Last Updated:

California: కాలిఫోర్నియాలో తుఫాన్‌ బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటన

California: కాలిఫోర్నియాలో తుఫాన్‌ బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటన

California: అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలిఫోర్నియా (California)లో తుఫాన్ ప్రభావం కొన్ని వారాలుగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు భారీ వర్షాలకు అల్లాడిపోతున్నారు. తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో అమెరికాలో భారీ విపత్తు చోటుచేసుకుందని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు తుఫాన్ ప్రభావంతో 19 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

మరిన్ని చలిగాలులు కాలిఫోర్నియాను చుట్టేస్తాయని.. భారీ వర్షాలకు మట్టి చరియలు విరిగి పడే ముప్పు ఉందని తెలిసింది.

దీంతో ప్రజలు అప్రమత్తగా ఉండాలని జాతీయ వాతావరణ సర్వీస్‌ తెలిపింది.
కాలిఫోర్నియా నుంచి కొలారెడో వరకు భారీ మంచు పడే అవకాశం ఉందన్నారు.

ప్రయాణికులు అటువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఓ వైపు మంచు.. మరోవైపు భారీ వర్షాలతో డ్యాములు నిండిపోతున్నాయి.

ఇక చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వందలాది ఇళ్లల్లో చిక్కుకోగా.. వేలాది మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.

పలు ప్రాంతాల్లో భారీ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ వరదల వల్ల 34 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచన వేస్తున్నారు.

నదుల్లో వరద పెరగడంతో.. జాతీయ రహదారులపైకి వరదు నీరు భారీగా చేరుతుంది.

ఈ తుఫాన్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతుండగా.. మరో తుఫాన్ అమెరికా వాసులను కలవరపెడుతుంది.

ఈ నేపథ్యంలో 24వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాలిఫోర్నియా నుంచి ఈ తుఫాన్‌ లాస్‌ ఏంజెల్స్‌ వైపు వెళుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

బాధిత ప్రజలకు అవసరమైన సాయం అందించాలని వైట్ హౌజ్ ఆదేశించింది.

వరదలు.. తుఫాన్ ప్రభావానికి గురైన బాధితులకు ఆదుకోవాలని అధికారులకు వైట్ హౌజ్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఎమర్జెన్సీ ప్రకటనతో బాధితులకు తాత్కాలిక వసతి కల్పించనున్నట్లు అక్కడి అధికార యంత్రాంగం తెలిపింది.
`కాలిఫోర్నియాను భారీ చ‌లిగాలులు చుట్టుముడ‌తాయి. భారీగా కురుస్తున్న వ‌ర్షాల‌తో మ‌ట్టి చ‌రియ‌లు విరిగి ప‌డే ముప్పు ఉంది.

కాలిఫోర్నియా నుంచి కొలారెడో వ‌ర‌కు ప‌ర్వ‌త శ్రేణుల నుంచి భారీగా మంచు కురుస్తుండ‌టంతో ప్ర‌యాణం ప్ర‌మాద‌క‌రం` అని జాతీయ వాతావ‌ర‌ణ స‌ర్వీస్ హెచ్చ‌రించింది.

వ‌ర‌ద‌ల వ‌ల్ల కాలిఫోర్నియాలో క‌నీసం 19 మంది మృతి చెందారు. వ‌ర‌ద నీరు లోత‌ట్టు ప్రాంతాల్లో ప్ర‌యాణిస్తున్న‌ది.

కోస్తా పొడ‌వునా మూడంతస్తుల ఎత్తులో అల‌లు ఎగ‌సి ప‌డుతున్నాయి. ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల 34 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

కాలిఫోర్నియాలోని సాలినాస్ న‌ది వ‌ర‌ద‌తో ప‌రివాహ‌క ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న‌ది. జాతీయ ర‌హ‌దారుల‌పై వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తున్న‌ది.

మ‌రో తుఫాన్ పొంచి ఉన్న నేప‌థ్యంలో 24 వేల మందికి పైగా ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/