Published On:

TFCC President: షాకింగ్‌.. ఎన్నికైన 24 గంటల్లోనే TFCC అధ్యక్ష పదవికి సునీల్‌ నారంగ్‌ రాజీనామా!

TFCC President: షాకింగ్‌.. ఎన్నికైన 24 గంటల్లోనే TFCC అధ్యక్ష పదవికి సునీల్‌ నారంగ్‌ రాజీనామా!

Sunil Narang Resigned As TFCC President: తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష పదవికి సునీల్‌ నారంగ్‌ రాజీనామా చేశారు. అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోనే ఆయన పదవికి రాజీనామా చేయడం సినీవర్గాల్లో, ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా ఇచ్చారు. తనకు సమాచారం ఇవ్వకుండానే ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాని ఆయన చెప్పారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రెసిడెంట్‌ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా టాలీవుడ్‌లో పర్సంటేజీలు, థియేటర్ల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పర్సంటేజీల విషయమై నిర్మాతలకు సింగిల్‌స్క్రిన్‌ థియేటర్ల ఓనర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్‌ చేయనున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ తరుణంలో పవన్‌ కళ్యాన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి టాలీవుడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సినిమా రిలీజ్‌ సమయంలో కావాలనే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక టాలీవుడ్ గౌరవ ముఖ్యమంత్రి కలిశారా? అని ప్రశ్నించారు. ఇకపై వ్యక్తిగతంగా వచ్చి టికెట్ల రేట్ల పెంపు గురించి అడిగేది లేదని, అన్ని నిబంధన ప్రకారమే జరగాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో నిన్న జరిగిన టీఎఫ్‌సీసీ అధ్యక్ష పదవిలో ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్‌ నారంగ్‌ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా.. నిన్న (శనివారం) సాయంత్రం తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఎఫ్‌సీసీ సునీల్‌ నారంగ్‌ ఎన్నికయ్యారు.

 

ఎన్నికైన అనంతరం ఆయన పాలక మండలిని కూడా ప్రకటించారు. మూడోసారి అధ్యక్షుడిగా సునీల్‌ నారంగ్‌, కార్యదర్శిగా శ్రీధర్‌ సహా 15 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవికి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడుతూ.. థియేటర్ల వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని స్పష్టం చేశారు. హీరోలు దేవుళ్లు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌, నిర్మాతలు చేయరని పేర్కొన్నారు. ఇక కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తుఫానులాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికి లేదన్నారు.

ఇవి కూడా చదవండి: