Last Updated:

Chandrasekhar Yeleti Father Death: ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి ఇంట తీవ్ర విషాదం!

Chandrasekhar Yeleti Father Death: ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి ఇంట తీవ్ర విషాదం!

Director Chandrasekhar Yeleti Father Died: ప్రముఖ తెలుగు డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఏలేటి సుబ్బారావు(75) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఏలైటి సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రేఖవానిపాలెంలో నివాసముంటున్నారు.

అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్యలు ఏలేటి సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి చంద్రశేఖర్ ఏలేటికి డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా ఏలేటి చంద్రశేఖర్‌ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. అలాంటి దర్శకుడు తండ్రిని కోల్పోవడం బాధాకరమంటూ అభిమానులు సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: