Home / ఎడ్యుకేషన్ & కెరీర్
నేడు ( జూన్ 11, 2023 ) తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ పునఃప్రారంభమవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా వెల్లడించారు. ఈ నెల 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ ప్రభుత్వ పథకం జగనన్న విద్యా కానుక కిట్ లను విద్యార్థులకు అందిస్తారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్ లు ఇస్తున్నట్లు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్ష భారత్ తో పాటు పలు విదేశాల్లో మే 7 న ఈ పరీక్ష జరిగింది.
మన దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్ టాప్ లో ఉండటం వరుసగా ఐదో సారి. అదే విధంగా ఉత్తమ యూనివర్పిటీల ర్యాంకింగ్స్ లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్ఠానాన్ని కైవసం చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లో శనివారం (జూన్ 3) నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెయిన్స్ పరీక్ష జరుగుతుంది.
ప్రతి ఏటా రీజినల్ రూరల్ బ్యాంకుల్లో నియామకాల కోసం ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్’ పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023 కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
తెలంగాణలో పోలీసు నియామక చివరి రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం క్వాలిఫై అయిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 181 సైంటిస్ట్ (b) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది డీఆర్డీవో. సైన్సులో ఇంజినీరింగ్, పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు అర్హులుగా డీఆర్డీవో పేర్కొంది.
తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఈ షెడ్యూల్ ను విడుదల చేసింది. గురువారం ఎంసెట్ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే.