Home / ఎడ్యుకేషన్ & కెరీర్
ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి గాను గత నెల 28న పరీక్షలు నిర్వహించగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే నేడు ఫలితాలను విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1569 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిచెయ్యనుంది.
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ. తాజాగా విడుదలైన 181 అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యింది.
ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) చరిత్రలో తొలిసారిగా 27 మంది చివరి సంవత్సరం లా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్న్లో చేరేందుకు అవకాశం దక్కించుకున్నారు. వీరు ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు.
అమెరికా జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో అధికభాగం భారతీయ విద్యార్థులకే లభించాయి. 2022 సంవత్సరానికి గాను 82 వేల మంది భారతీయ విద్యార్ధులకు మనదేశంలోని యూఎస్ మిషన్లు స్టూడెంట్ వీసాలను జారీ చేశాయి.ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కువ.
భారతీయుల మేధస్సుకు ప్రపంచం సలాం కొడుతుంది....ఉన్నత స్ధాయి కంపెనీల్లో కీలక పదవులను పొందుతూ దేశ ప్రాముఖ్యతను మరింతగా ఇనుమడింపచేస్తున్నారు. విశ్వ వాణిజ్య శ్రేణిలో పలు రంగాల్లో దిగ్గజ కంపెనీల ప్రతినిధులుగా భారతీయులు రాణిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను ఇట్టే కౌవశం చేసుకొంటున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) ఫలితాలు విడుదలయ్యాయి. రాజస్థాన్ అమ్మాయి తనిష్క మొదటి ర్యాంక్ ను కైవసం చేసుకుంది. తర్వాత వత్స ఆశిష్ బాత్రా మరియు హృషికేష్ నాగభూషణ్ గంగూలే తరువాత స్దానాల్లో నిలిచారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు క్రింది పోస్టులకు భర్తీ చేయడానికి దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 స్పెషలిస్ట్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశా స్కాలర్ షిప్తో పేద విద్యార్దులకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 6 నుంచి 12వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్షిప్గా అందిస్తారు.
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా 5008 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్స్ లేదా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టులను భర్తీ చేయనుంది.