BIPC students: బైపీసీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా?
ఇంటర్మీడియట్ బైపీసీ తో చదివిన వారు కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా? కొన్ని యూనివర్శిటీలు, కాలేజీలు తమకు ఈ కోర్సులకు అనుమతి ఉందంటూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.

BIPC students: ఇంటర్మీడియట్ బైపీసీ తో చదివిన వారు కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా? కొన్ని యూనివర్శిటీలు, కాలేజీలు తమకు ఈ కోర్సులకు అనుమతి ఉందంటూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు. అటువంటి కోర్సులకు ఎటువంటి గుర్తింపు ఉండదని అది కేవలం వివ్యార్దులను మోసం చేయడమే నని ఆయన చెప్పారు.
మ్యాధమెటిక్స్ తప్పనిసరి..(BIPC students)
బిజినెస్ స్కూల్స్ వేరు.టెక్నాలజీ స్కూల్స్ వేరు. బిజినెస్ ఎనలటిక్స్. డేటా సైన్స్ వంటి కోర్సులకు వెళ్లవచ్చు కాని బైపీసీ విద్యార్దులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడానికి అనర్హులని ఆయన చెప్పారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కు కూడ ఇంటర్ లో మ్యాధ్స్ ఉండాలి. అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు. ఎన్ఐటీలలో ఎంసీఏ చేయాలన్నా 11, 12 తరగతుల్లో మ్యాధ్స్ ఖచ్చితంగా చదవాలి. బయోఇన్ఫర్మెటిక్స్ కోర్సుకు కూడా మ్యాధ్స్ చదివి ఉండాలి. విదేశాల్లో కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. అలహాబాద్ హైకోర్టు మెడిసిన్ చదవాలంటే ఎంపీసీ చదివిన వారిని అదనంగా బయాలజీ చదివి నీట్ పరీక్షకు వెళ్లమని చెబుతోంది. ఏపీ, తెలంగాణలో మాత్రం బయోటెక్నాలజీ కోర్సుకు మాత్రం బైపీసీ వారిని అనుమతిస్తున్నారు. వీరికి బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. బైపీసీ చదివిన వారు కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేయాలనుకంటే వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని మరలా మ్యాధ్స్ చదివి వెళ్లాలి. దీనికి మినహాయింపు లేదని సతీష్ చెప్పారు. ఈ కోర్సులకు సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలున్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్ 8886629883ను సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- Hari Rama Jogaiah : అసలు మీరు ఆయనకే పుట్టారా అనిపిస్తోందని.. సీఎం జగన్ పై ఫైర్ అయిన హరిరామ జోగయ్య
- Road Accident : కరీంనగర్ జిల్లాలో విషాదం.. రోడు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి