Tulsi Mala: తులసీ మాలను ధరించేటప్పుడు ఈ నీయమాలను తప్పక పాటించాలి!
Tulsi Mala Benefits In Telugu:సనాతన ధర్మంలో పలురకాల ఆచారవ్యవహారాలు ఉన్నాయి. అందులో దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం లాంటి వాటితో పాటు మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ దైవిక శక్తిని పలురకాల చేరుకునేందుకు భాగమయ్యాయి. అయితే దక్షిణాచారం కేవలం వెజిటేరియన్ ఫుడ్ ను ప్రసాదాలను, నైవేధ్యాలతో బగవంతుని పూజ చేయవచ్చు, ఇందులో బలులను బూడిద గుమ్మడికాయలతో చేస్తారు. . వామాచారంలో మాత్రం జంతుబలులను ఆశ్రయిస్తారు. ఓకే దైవిక శక్తి పలు రకాలుగా ప్రకటం అవుతుంది. అందులో భాగంగానే పలు రకాల దైవిక శక్తిని కొలుస్తారు.
ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో శాకాహారపద్దతులను పాటిస్తారు. విష్ణుభగవానుడిని సాత్వికమైన పద్దతులతో కొలుస్తారు. వారికి సాత్వికమైన నైవేద్యాలను సమర్పిస్తారు. దాంతోపాటే పూజా విదానాలు కూడా సాత్వికంగా ఉన్నాయి. తులసీమాలను ఏకులమైనా వర్ణమైనా ఏ జాతి అయినా ధరించవచ్చు. అంటరానితనం సనాతన ధర్మంలో లేదు. దానిని కొందరు వ్యక్తులు వారి స్వార్థం కోసం పాటించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి శ్రీకృష్ణ భక్తులు యధేశ్చగా భక్తితో ధరించవచ్చు. అందుకు కొన్ని నీయమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
వైష్ణవ సాధనా పద్దతులలో తులసిమాల ప్రాముఖ్యత
తులిసిమాలను వైష్ణవ సాంప్రదాయంలో ధరిస్తారు. తులసిమాలను జపానికి వాడతారు. దీన్ని శ్రీహరికి దరింపచేస్తారు. అయితే సాత్విక పద్దతిలో ఉన్న తులసి మాలను వామాచార పద్దతితో జోడిస్తే దీని శక్తి తగ్గుతుంది. ఉదాహరణకు తులసి మాలను నాన్ వెజ్ తిన్నప్పుడు ధరించినప్పుడు దాని శక్తి తగ్గుతుంది. ఎందుకంటే అది అన్ని శక్తులను గ్రహించదు. కేవలం సాత్విక శక్తికి మాత్రమే ఉపయోగపడుతుంది.
ఇందుకు మరో ఉదాహరణ కూడా చెప్పవచ్చు .. రుద్రాక్ష.. దీని పేరు తెలువని భారతీయుడు ఉండడు. రుద్రాక్ష. శివుని కన్నులనుంచి జాలువారిన కన్నీటి బొట్టుతో ఆవిర్భావం అవుతుంది. అయితే ఈ రుద్రాక్షను ఇటు సాత్విక సాధనలలో, అటు వామాచార సాధనలలో కూడా వాడతారు. ముఖ్యంగా భైరవ స్వామికి, కాలీమాతకు సాధన చేసే వారు వామాచారం పూజలు చేసే టప్పుడు రుద్రాక్ష మాలను వాడతారు.
తులసిమాల రుద్రాక్షలాగే పవిత్రమైనది. ఇది ఆద్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది. తులసి జపమాల ఆధ్యాత్మిక పురోగతికి ఒక సాధనం మాత్రమే కాదు, దానిని ధరించే వ్యక్తిని సానుకూల శక్తితో నింపుతుంది. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది మరియు తులసి జపమాల ధరించే వ్యక్తి శ్రీ హరి ఆశీర్వదించబడతాడు. కానీ తులసి జపమాల కేవలం ఫ్యాషన్ వస్తువు కాదు, ఇది విశ్వాసం మరియు నిగ్రహానికి చిహ్నం అని గమనించాలి. దీనిని ధరించడానికి నియమాలు ఉన్నాయి, వీటిని పాటించాలి, లేకుంటే దాని ప్రభావాలను తగ్గించవచ్చు.
తులసి జపమాల ధరించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
మాంసం, చేపలు, గుడ్డు మరియు మద్యం తిన్న తర్వాత తులసి జపమాల ధరించడం నిషేధించబడింది. నిద్రపోతున్నప్పుడు లేదా లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పుడు జపమాల మెడ చుట్టూ ఉండకూడదు. మరే ఇతర వ్యక్తి జపమాల తాకడానికి లేదా ధరించడానికి అనుమతించవద్దు. ప్రదర్శన లేదా ఫ్యాషన్ కోసం దీనిని ధరించడం మతపరంగా తగనిది. జపమాల గౌరవించకపోవడం దాని శక్తిని తగ్గిస్తుంది.
ముఖ్యంగా మెడలో వేసుకున్న మాలతో తిరిగి జపం చేయకూడదు.
స్నానం చేసిన తర్వాత మాత్రమే మెడలో తులసి జపమాల ధరించండి. ధరించేటప్పుడు “హరే కృష్ణ మహామంత్రం” లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” జపించండి. తినేటప్పుడు లేదా అపవిత్ర ప్రదేశాలలో ధరించడం మంచిది కాదు. జపమాల విరిగిపోతే, దానిని విసిరే బదులు, దానిని గంగాజలంతో శుద్ధి చేసి నదిలో ప్రవహించండి దానిని ఉంచే ముందు గంగాజలంతో, దూపం, నెయ్యి, పాల, తేనెతో శుద్దిచేయండి. శుద్దిచేయకుండా ఏమాలను కూడా మెడలో ధరించకూడదు.