Today Panchangam : నేటి (మార్చి 21, మంగళవారం ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 21 ) మంగళవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఫాల్గుణం 30, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, క్రిష్ణ పక్షం, అమావాస్య తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 28, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 21 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ఈరోజు అమావాస్య తిథి ఉదయం 10:53 గంటల వరకు, ఆ తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉదయం 5:26 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాభాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు ఉదయం 11 గంటలకు కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : భౌమవతి అమావాస్య
సూర్యోదయం సమయం 21 మార్చి 2023 : ఉదయం 6:24 గంటలకు
సూర్యాస్తమయం సమయం 21 మార్చి 2023 : సాయంత్రం 6:32 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:18 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:04 గంటల నుంచి అర్ధరాత్రి 12:52 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:31 గంటల నుంచి సాయంత్రం 6:55 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 10:10 గంటల నుంచి ఉదయం 11:37 గంటల వరకు
సర్వార్ధ సిద్ధి యోగం : సాయంత్రం 5:26 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:23 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:50 గంటల నుంచి ఉదయం 9:39 గంటల వరకు, తిరిగి అర్ధరాత్రి 11:17 గంటల నుంచి రాత్రి 12:44 గంటల వరకు
ఈరోజంతా పంచక్ కాలం ఉంటుంది.
నేటి పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. పూర్వీకులను స్మరించుకుంటూ నువ్వులను దానం చేయాలి.