Last Updated:

Horoscope: నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2022)

ఈ రోజు మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతతను ఉల్లాసాన్ని పొందుతారు. అన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

Horoscope: నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2022)

Horoscope: ఈ రోజు మీరు మీ కుటుంబంతో కొంత సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతతను ఉల్లాసాన్ని పొందుతారు. అన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

1.మేష రాశి
ఈరోజు మీరు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీరు మానసిక తృప్తిని పొందగలరు. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచే పనులలో నిమగ్నమవ్వండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగస్థులకు నేడు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా జరుగుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో వరుస గొడవలు అవడం వల్ల ఆమెను మెప్పించడం మీకు కాస్త కష్టతరంగా ఉంటుంది.

2 .వృషభ రాశి
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం ఈ రోజు మీకు రివార్డ్ లను తెచ్చిపెడుతుంది. మానసిక ప్రశాంతతను నాశనం చేసే వ్యక్తులకు పనులకు కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈరోజు మీ వైహహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

3. మిథున రాశి
వృత్తివ్యాపారాల్లో మీ తండ్రి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. నిరాశ నిసృహలను మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీకు మీ భాగస్వామికి మధ్య తగువలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

4. కర్కాటక రాశి
మీరు మీ జీవితాన్ని సాఫీగా, నిలకడగా జీవించాలి అనుకుంటే ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి పట్ల జాగురూపకతతో ఉండాలి. కుటుంబమంతా కూడితే వినోదం సంతోష దాయకం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం తప్పనిసరి. జీవితంలో ఆనంద సమయం గడపడం కోసం కాస్త మీ సమయాన్ని కుటుంబ సభ్యుల కోసం గడపండి.

5. సింహ రాశి
శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన నేడు ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి వెళ్తారు. హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపేవిధంగా జీవిత విధానాన్ని మార్పు చేసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిరోజుగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మీకు ఎంతో లబ్దిని చేకూరుస్తుంది.
ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి.

6. కన్యా రాశి
మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో మీ స్నేహితులు అవసరాన్ని మించి జోక్యం చేసుకుంటారు. ఎంతో జాగ్రత్తను చెప్తూ, అర్థం చేసుకునే స్నేహితున్ని ఈ రోజు మీరు కలుస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్ట్ లపైన పనిచేయండి. మీకు అవి లాభదాయకంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. మీ వైవాహిక జీవితం ఈరోజు బాగుంటుంది.

7. తులా రాశి
మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం జరుగుతుంది. దానితో కొన్ని నష్టాలు కలుగుతాయి. మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. మీ చర్యలన్నీ దురాశతో కాకుండా ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవండి దీని వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి. ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనంద క్షణాలను గడుపుతారు.

8. వృశ్చిక రాశి
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీరు సంతోషం, ఆనందం పొందుతారు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వలన మీరు ఆర్ధికప్రయోజనాలను అందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

9. ధనస్సు రాశి
ఎన్నెన్నో పనులు మీ భుజస్కందాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసును ప్రశాంతతగా ఉంచడం అవసరం. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా వ్యహరించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం వల్ల మీరు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.

10. మకర రాశి
ఈ రోజు మీ సాయంత్రం, మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగ మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ వీటన్నింటి కంటే ఎక్కువ కనుక మీకు బాధ కలిగించే వాటిని మర్చిపోండి. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు.
మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం మిమ్మల్ని ఆనందంగా ఉంచుంతుంది. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వైహహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

11. కుంభ రాశి
ఐటీ వృత్తిలోని వారికి, వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ రోజు అవకాశం వస్తుంది. మీరు ఏకాగ్రతతో నిరంతరాయంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది. ఈ రోజుంతా మీ మూడ్ చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీ భావోద్వేగాలని అదుపు చేసుకోండి. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ఈ రోజు మీకు ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభిస్తాయి. మీ భాగస్వామితో ఈ రోజు ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
ఈ రోజు మీకు, మీ మనస్సుకు బాగా దగ్గరైనవారికి మధ్య గొడవలు జరిగే అవకాశము ఉంది. దీని వలన మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది. దీని వలన మీరుకస్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ప్రతి చిన్న విషయానికి మీ జీవిత భాగస్వామితో గొడవపడకండి. ఈ రోజు మీ వైహహిక జీవితం సరదాగా సాగుతుంది.

ఇదీ చదవండి: నాలుగు పిల్లర్లపై దేవాలయ నిర్మాణం….చూడాలంటే విమానం ఎక్కాల్సిందే…

ఇవి కూడా చదవండి: